రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్‌ఐసీ సర్కిల్ వద్ద ఈనెల 22వ తేదీ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానికుల సమాచారంతో అంబులెన్స్‌లో రిమ్స్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ఎస్‌ఐ తెలిపారు. వివరాలు తెలిసిన వారు 9121100510 లేదా 9121100511 నంబరుకు గానీ సమాచారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు.
కాలువలో పడి మహిళ..
కడప అర్బన్ : కడప ఒన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోచంపేటకు చెందిన విజయకుమారి (33)కి ఉన్నట్లుండి మూర్ఛ రావడంతో కాలువలో పడి మృతి చెందినట్లు ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మృతురాలికి ముగ్గురు పిల్లలున్నారు. ఆమె ఇటీవలి కాలంలో మూర్ఛవ్యాధితో బాధపడుతూ ఉండేది. రోడ్డుపై వెళుతూ ఉన్నట్లుండి ఫిట్స్ రావడంతో కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.
కలివికోడిపై కర్ణాటక ట్రైనీ
రేంజ్ అధికారులకు శిక్షణ
అట్లూరు : కలివికోడిపై కర్ణాటక ట్రైనీ రేంజ్ అధికారులకు బుధవారం రేంజ్ అధికారి నయీమ్ అలీ శిక్షణ ఇచ్చారు. కర్ణాటక స్టేట్ అకాడమి ట్రైనీ రేంజ్ అధికారులు 42 మంది లంకమల్లేశ్వర అభయారణ్యంలోని కొండూరు బీట్ పరిధిలోని కలివికోడి ఆవాస ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి నయీమ్‌అలీ ట్రైనీ రేంజ్ అధికారులకు కలివికోడి కోసం అమర్చిన కెమెరాలతీరు, కలివికోడి ఆవాసం అభివృద్ధికి చేపట్టిన చర్యలను వివరించారు. ఈ కార్య క్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి ఓబులేసు, సెక్షన్ ఆఫీసర్ సురేష్‌బాబు, బీట్ ఆఫీసర్ విశ్వనాథరెడ్డి, బీట్ వాచర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెండు బైకులు ఢీకొని
వ్యక్తికి గాయాలు
కలసపాడు : మండలంలోని సింగరాయపల్లి వద్ద బుధవారం రెండు బైకులు ఢీకొని ఓ వ్యక్తికి గా యాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మే రకు సింగరాయపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలసపాడు నుంచి తమ స్వగ్రామానికి టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంలో వెళుతున్నారు. అదే క్రమంలో ఎగువరామాపురం నుంచి ఓ వ్యక్తి కలసపాడుకు ద్విచక్ర వాహనంలో వస్తున్నాడు. పాత రామాపురం సింగరాయపల్లె గ్రా మాల మధ్య మలుపు వద్ద రెండు బైకులు ఢీకొని సింగరాయపల్లి గ్రామానికి చెందిన గుడిమే రాజయ్యకు కుడికాలు విరిగింది. స్థానికులు 108 వాహనం ద్వారా పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు కడప రిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment