ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృ
చిన్నమండెం : మండల పరిధిలోని రోడ్డువారికురవపల్లి వద్ద భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా బుధవారం సాయంత్రం ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని టీవీఎస్ ఎక్సెల్‌లో వెళ్తున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అరమాటి రెడ్డప్పరెడ్డి(70) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మండల పరిధిలోని దేవగుడిపల్లె గ్రామం జల్లావాండ్లపల్లెకు చెందిన రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగి అరమాటి రెడ్డప్పరెడ్డి బాపూజీనగర్ కాలనీలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు 108కు ఫోన్ చేయగా ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. 108 అంబులెన్స్ సకాలంలో వచ్చి ఉంటే అతను బతికేవాడని స్థానికులు అంటున్నారు. మృతుడు ఆర్మీలో రిటైర్డ్ అయి రాయచోటిలోని స్టేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేశారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా అందరికీ వివాహమైంది.
Comments
Please login to add a commentAdd a comment