నేడు సీపీఐ ఆవిర్భావ దినోత్సవం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆవిర్భవించి 99 ఏళ్లు పూర్తి చేసుకొని డిసెంబర్ 26 నుంచి వంద సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా జిల్లాలో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పిలుపునిచ్చిన ఏకై క పార్టీ సీపీఐ అన్నారు. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, సీపీఐ మాత్రమేనన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కమ్యూనిస్టు యోధులు అనేక మంది త్యాగాలు చేశారని, జైలుకెళ్లారని, ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారని చెప్పారు. భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు. నేటికీ కష్టజీవుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర ఉద్యమాలు చేస్తోందని తెలిపారు. జిల్లాలో కడప రేడియో స్టేషన్ సాధనకు విశేష కృషి చేసిందన్నారు. పేదలకు ఇంటి స్థలాల కోసం ప్రత్యక్ష భూ పోరాటాలు నిర్వహించి పేదల కాలనీలను నిర్మించిందన్నారు. సాగునీటి పారుదల ప్రాజెక్టుల సాధన కోసం సాగించిన పోరాటాలకు గుర్తింపుగా గండికోట ప్రాజెక్టుకు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి పేరు పెట్టారని పేర్కొన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజల తరపున పోరాటాలు నిర్వహిస్తున్న సీపీఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 26న జిల్లాలో వాడవాడలా పార్టీ జెండాలు ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అలాగే 28న కడప నగరంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకష్ణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య తదితరులు హాజరవుతారని తెలిపారు.
వైఎస్సార్ జిల్లాలో పార్టీ
పతాకావిష్కరణలు
28న కడపలో భారీ ర్యాలీ,
బహిరంగ సభ
హాజరు కానున్న
సీపీఐ రాష్ట్ర నాయకులు
Comments
Please login to add a commentAdd a comment