ఎన్నికల కమిషన్‌ను ప్రజలే రక్షించుకోవాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఎన్నికల కమిషన్‌ను ప్రజలే రక్షించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ కో–ఆర్డినేటర్ బండి జకరయ్య పేర్కొన్నారు. బుధవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీ, వెబ్ కాస్టింగ్, అభ్యర్థుల వీడియోలు, ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీని నిషేధించి మోడీ ప్రభుత్వం పారదర్శకతకు పాతర వేసిందన్నారు. రిగ్గింగు, అవకతవకలు సహా ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు సీసీ టీవీలు, వెబ్ క్యాస్టింగ్‌ను కొన్నేళ్ల క్రితం ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిందన్నారు. ఎన్నికల రికార్డులు బయటపడితే బీజేపీకి ఇబ్బందికరమని భయంతోనే మోడీ సర్కార్ ఎలక్ట్రానిక్ రికార్డుల తనిఖీపై నిషేధం విధించిందన్నారు.
హేళన చేశాడని కత్తితో దాడి
ప్రొద్దుటూరు క్రైం : తనను హేళన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడాడన్న కోపంతో జైపాల్ అనే వ్యక్తిపై తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి కత్తితో దాడి చేశారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాళ్లమాపురం గ్రామానికి చెందిన డేవిడ్ కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వెళ్తుండగా వారిని చూసిన జేష్టాది ౖజైపాల్ హేళనగా మాట్లాడాడు. ఈ క్రమంలో క్రిస్‌మస్ పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి జైపాల్, డేవిడ్ కుమారులు అశోక్, అఖిల్ మరి కొందరు కలిసి గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాల వద్ద చలిమంట వేసుకున్నారు. అక్కడ వీరంతా వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన డేవిడ్ తమను అవహేళన చేస్తూ ఎందుకు మాట్లాడతావంటూ జైపాల్‌ను ప్రశ్నించాడు. అక్కడ వారి మధ్య మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. డేవిడ్ తన ఇద్దరు కుమారులు కలిసి కత్తితో దాడి చేయగా జైపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన జైపాల్‌ను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అతన్ని కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహమ్మద్‌రపీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment