వైభవం..పుష్ప రథోత్సవం
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీఈశ్వరీదేవిమఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన బుధవారం పుష్పరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకమాత పుష్పరథంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. జగజ్జననికి మఠాధిపతి వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించారు. గుడి ఉత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అనుమసముద్రం మండలం కొలను గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న, భువనేశ్వర్‌రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం అలరించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన వీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న కోలాటం
శెట్టివారిపల్లెకు చెందిన శ్రీ రామాంజనేయ మహిళా బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈఓ బీవీ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దాతలు విజయవాడకు చెందిన గుంటముక్కల వెంకటేశ్వరరావు, వైజాగ్‌కు చెందిన గోపిశెట్టి సురేంద్రనాథ్, కడపకు చెందిన మునగా బద్రినాథ్ శ్రేష్టి, ప్రకాశం జిల్లా కంభంకు చెందిన తిరువీధి లక్ష్మీరంగయ్యశ్రేష్టి, బ్రహ్మంగారిమఠం ముక్కమల్ల భాస్కర్‌రెడ్డి, సుంకు సురేష్‌బాబు, చెరువుపల్లి ఓంకారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment