మంచు కురిసింది.. కొండ మురిసింది.!
బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ బుధవారం సరికొత్త ప్రకృతి అందాలను సంతరించుకుంది. నింగినుంచి మేఘాలు కొండపైకి దిగి కమ్ముకోవడం, చలి పెరగడం సహజంగా సందర్శకులు ఆస్వాదిస్తుంటారు. అయితే బుధవారం దీనికి భిన్నంగా ప్రకృతి పులకించింది. తెల్లవారుజాము నుంచి దట్టమైన మేఘాలు నింగిని వీడి కొండను కౌగిలించుకున్నట్టుగా అతుక్కుపోయాయి. ఆ మేఘాల నుంచి కురుస్తున్న తుంపర్లు లాంటి జల్లులు పడుతుంటే ప్రకృతికి కొత్త అందాలు అద్దినట్టుగా పరవశించింది. పగలే చీకటిగా మారిపోవడంతో అతిథి గృహాల వద్ద లైట్లు వెలిగించారు. పెద్దసంఖ్యలో వచ్చిన సందర్శకులు గాలిబండ వద్ద మేఘాల జల్లుల్లో సందడి చేస్తూ తడిసి ముద్దయ్యారు. రోజంతా కొండను మేఘాలు వీడకపోవడం విశేషం. – బి.కొత్తకోట
Comments
Please login to add a commentAdd a comment