Today Horoscope: ఈ రాశివారికి వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది | Today Telugu Horoscope On July 5th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది

Published Fri, Jul 5 2024 6:57 AM | Last Updated on Fri, Jul 5 2024 9:05 AM

Daily Horoscope On July 05, 2024 In Telugu

శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు; జ్యేష్ఠ మాసం, తిథి: అమావాస్య తె.3.53 వరకు (తెల్లవారితే శనివారం), తదుపరి ఆషాఢ శుక్ల పాడ్యమి; నక్షత్రం: ఆరుద్ర తె.4.20 వరకు (తెల్లవారితే శనివారం); తదుపరి పునర్వసు; వర్జ్యం: ప.12.47 నుండి 2.24 వరకు ; దుర్ముహూర్తం:  ఉ.8.09 నుండి 9.02 వరకు, తదుపరి ప.12.30 నుండి 1.23 వరకు; అమృత ఘడియలు: రా.6.24 నుండి 8.01 వరకు; సూర్యోదయం :  5.33; సూర్యాస్తమయం : 6.34; రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు.

మేషం.. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. భూ, వాహనయోగాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

వృషభం.. వ్యయప్రయాసలు. రాబడికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు. అనారోగ్యం.

మిథునం.. నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు మరింత రాణిస్తాయి.

కర్కాటకం.. అనుకున్న పనుల్లో జాప్యం. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆరోగ్యభంగం. మనశ్శాంతి లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

సింహం.. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. చిరకాల మిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య.. వ్యవహారాలలో విజయం. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

తుల.. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఇట్బందికరంగా ఉంటాయి.

వృశ్చికం.. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు.. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మకరం.. కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. కార్యజయం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కుంభం.. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం.. శ్రమ తప్పదు. పనులు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement