ఈ రాశివారికి ధనలబ్ధి.. కొత్త పనులు చేపడతారు! | Horoscope Today: Rasi Phalalu October 12 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి ధనలబ్ధి.. కొత్త పనులు చేపడతారు!

Published Sat, Oct 12 2024 7:35 AM | Last Updated on Sat, Oct 12 2024 9:01 AM

Horoscope Today: Rasi Phalalu October 12 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.దశమి తె.4.21 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి ఏకాదశి, నక్షత్రం: శ్రవణం రా.12.53 వరకు, తదుపరి ధనిష్ట, వర్జ్యం: తె.4.43 నుండి 6.11 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.5.44 నుండి 7.30 వరకు, అమృతఘడియలు: ప.2.39 నుండి 4.10 వరకు, విజయదశమి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.55, సూర్యాస్తమయం: 5.39. 

మేషం: ఉత్సాహంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. శుభవర్తమానాలు. ఆర్థిక లాభాలు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

వృషభం: దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో పనిభారం. 

మిథునం: ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. బంధుగణంతో విభేదాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆలయదర్శనాలు.  వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో హోదాలు. 

సింహం: నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అందరిలోనూ గౌరవం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.  ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. కొత్త పనులు  ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలలోæ చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  సోదరులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో నిరాశ తప్పకపోవచ్చు.ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి.  ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. 

ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధువులతో తగాదాలు.  వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు. ధనలబ్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగాలలో కొత్త  పోస్టులు. వాహనయోగం.

కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. కుటుంబసమస్యలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.  ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement