ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి | Horoscope Today: Rasi Phalalu October 08 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి

Published Tue, Oct 8 2024 7:14 AM | Last Updated on Tue, Oct 8 2024 8:57 AM

Horoscope Today: Rasi Phalalu October 08 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.పంచమి ఉ.6.57 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: జ్యేష్ఠ రా.12.57 వరకు, తదుపరి మూల, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.37 నుండి 11.25 వరకు, అమృతఘడియలు: ప.3.33 నుండి 5.23 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.54, సూర్యాస్తమయం: 5.42. 

మేషం: రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొద్దిపాటి ఆస్తిలాభం. నూతన ఉద్యోగాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మిథునం: సన్నిహితుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెంచుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

కర్కాటకం: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసిరావు.

సింహం: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు. దూరప్రయాణాలు. 

కన్య: కొత్త పరిచయాలు. ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల విషయంలో కొత్త అంచనాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: నూతన పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

కుంభం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సోదరుల నుంచి ధనప్రాప్తి. కుటుంబసమస్యల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం: వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement