ఈ రాశివారు సమస్యల నుంచి గట్టెక్కుతారు | Today Telugu Horoscope On October 7th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారు సమస్యల నుంచి గట్టెక్కుతారు

Published Mon, Oct 7 2024 6:58 AM | Last Updated on Mon, Oct 7 2024 8:39 AM

Horoscope Today: Rasi Phalalu October 07 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.చవితి ఉ.5.56 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: అనూరాధ రా.11.42 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: తె.5.36 నుండి 7.16 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం: ప.12.13 నుండి 1.01 వరకు, తదుపరి ప.2.36 నుండి 3.24 వరకు, అమృతఘడియలు: ప.12.28 నుండి 2.11 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.54, సూర్యాస్తమయం: 5.43. 

మేషం: రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. చర్చలు సఫలం. నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.

మిథునం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: రుణభారాలు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అదనపు బాధ్యతలు.

సింహం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కన్య: సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

తుల: దూరప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

ధనుస్సు: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

మకరం: పనులు అనుకున్న విధంగా పూర్తి. సంఘంలో ఆదరణ. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: వ్యవహార విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: మిత్రులే శత్రువులుగా మారతారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement