Horoscope Today: ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. | Today Telugu Horoscope On October 10th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు..

Published Thu, Oct 10 2024 6:46 AM | Last Updated on Thu, Oct 10 2024 8:50 AM

Horoscope Today: Rasi Phalalu October 10 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.సప్తమి ఉ.7.17 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పూర్వాషాఢ రా.1.49 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ఉ.11.22 నుండి 12.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.51 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.34 నుండి 3.22 వరకు, అమృతఘడియలు: రా.8.50 నుండి 10.33 వరకు, దుర్గాష్టమి; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.55, సూర్యాస్తమయం: 5.40. 

మేషం: దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. శ్రమానంతరం పనులు పూర్తి.  స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: రాబడి నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మిథునం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. విలువైన సమాచారం. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: కాంట్రాక్టులు దక్కుతాయి. పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా పడతాయి.  కొన్ని సమస్యలు వేధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. నిరుద్యోగులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

తుల: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. మానసిక ఆందోళన. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. పనులు సకాలంలో పూర్తి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. బంధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. కొత్త కార్యక్రమాలు చేపడతారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement