జిల్లాలో అభివృద్ధికి మంగళం.. అవినీతికి అందలం
ఇన్‌చార్జి మంత్రి వద్ద
పంచాయితీ
జిల్లా టీడీపీలో ఇంటిపోరుతోపాటు నేతల అవినీతి, అక్రమాల వ్యవహారం జిల్లాకు చెందిన మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌లు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా అటువంటివారిని మందలించాలని అధిష్టానం సూచించినట్లు సమాచారం. పరిస్థితి చక్కదిద్దాలని అధిష్టానం ఇన్‌చార్జి మంత్రికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మంగళవారం బాపట్ల జిల్లాసమీక్ష మండలి సమా వేశానికి వస్తున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి పార్థసారధి పొలిటికల్ మీటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆయన జిల్లాలో నేతల అక్రమాలు, విబేధాలపై పంచాయితీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా నేతల అక్రమాలు, అవినీతి చిట్టాను పట్టుకొస్తున్న ఇన్‌చార్జి మంత్రి తొలుత జిల్లా కలెక్టర్‌తోనూ సమావేశమై నేతల వ్యవహారాలను ఆరా తీయనున్నట్లు సమాచారం. కలెక్టర్ ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌ను తీసుకొని ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment