గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా జయంత్యుత్సవాలను ఈనెల 7న నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించనున్నట్లు ఆచార్య ఎన్జీరంగా ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. సోమవారం లాంఫాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏడీఆర్ డాక్టర్ పి. సత్యనారాయణ, ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం, ఆచార్య ఎన్జీరంగా ట్రస్ట్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలను లాంఫాంలో నిర్వహిస్తారన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చంనాయుడు, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్, దూళిపాళ్ళ నరేంద్రకుమార్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఆర్.చింతల గోవిందరాజులు, డాక్టర్ లావు రత్తయ్య, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు, విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మిదేవి ఆచార్య ఎన్జీరంగా చేసిన కృషిని వివరిస్తారన్నారు. కార్యక్రమంలో రైతులు శాస్త్రవేత్తలతో చర్చాగోష్టి, డ్రోన్ వినియోగం, తదితర విషయాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment