ఆంధ్ర బౌలర్లు విజృంభణ
మంగళగిరి: నగర పరిధిలోని నవులూరు అమరావతి టౌన్షిప్లో ఉన్న ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కుచ్ బెహరా ట్రోఫీలో ఆంధ్ర జట్టు తన ఆధిపత్యాన్ని చాటింది. 615 పరుగుల భారీ స్కోర్‌తో డిక్లేర్ చేసిన ఆ జట్టు.. అనంతరం హిమాచల్ ప్రదేశ్‌పై బౌలింగ్‌లోనూ రాణించింది. మూడవ రోజు శుక్రవారం ఓవర్‌నైట్ స్కోర్ 50 పరుగులతో బ్యాటింగ్ చేపట్టిన హిమాచల్ ప్రదేశ్ జట్టు ఆంధ్ర బౌలర్ల ధాటికి 60.4 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు బి.యశ్వంత్, ఏఎన్ఎన్ లోహిత్‌లు చెలరేగి చెరో నాలుగు వికెట్లు తీశారు. హిమాచల్ ప్రదేశ్ బ్యాటర్ ఆర్పిత్సింగ్ మాత్రమే రాణించి 52 పరుగులు సాధించాడు, అనంతరం రెండవ ఇన్నింగ్స్ చేపట్టిన హిమాచల్ ప్రదేశ్ జట్టు మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 52 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లు ఎన్.రాజేష్, ఏవీఎన్ లోహిత్ చెరో రెండు వికెట్లు తీశారు. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 352 పరుగుల ఆధిక్యంలో వుంది.
132 పరుగులకే కుప్పకూలిన హిమాచల్ ప్రదేశ్
352 పరుగుల భారీ ఆధిక్యంలో ఆంధ్ర జట్టు
Comments
Please login to add a commentAdd a comment