బెల్టు షాపులపై ఉక్కుపాదం
● ఇప్పటికే వంద లీటర్ల మద్యం స్వాధీనం ● 34 మందిపై కేసులు నమోదు ● ఒంగోలు ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఒంగోలు ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయ చెప్పారు. శుక్రవారం ఆమె బాపట్ల ఎకై ్సజ్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో మద్యం షాపుల ఏర్పాటు, బెల్టు షాపుల కట్టడి, నాటుసారా నియంత్రణ, ఎంఆర్‌పీకి మద్యం విక్రయాలు తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో బెల్టు షాపుల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు ఏడు పోలీసు స్టేషన్ల పరిధిలో 34 బెల్టు షాపుల నుంచి వంద లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 34 మందిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 4,600 లీటర్ల ఊట ధ్వంసం చేసి, 28 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. మద్యం షాపుల్లో ఎంఆర్‌పీకే విక్రయించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఈఎస్ దేవదత్తు, ఏఈఎస్ వెంకటేశ్వర్లు, జనార్దనరావు, సీఐ గీతిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment