నగరాభివృద్ధిలో యూనిడో భాగస్వామ్యం కీలకం
నెహ్రూనగర్: గుంటూరు నగరాభివృద్ధిలో యూనిడో భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని, భవిష్యత్‌లో మరిన్ని నూతన ప్రాజెక్ట్‌ల ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూనిడో) సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నందపాల్ సింగ్, నేషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ దీపికా శ్రీపాద్‌లతో నగరపాలక సంస్థ కమిషనర్ తన చాంబర్‌లో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కాలుష్యరహితంగా గుంటూరు నగరాన్ని మార్చుకోవడంలో యూనిడో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫండ్ (జీఈఎఫ్) ద్వారా సంపూర్ణ సహకారం లభిస్తోందని చెప్పారు. ఇప్పటికే సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో ఫ్లోటింగ్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు, ఈ–ఆటోలకు రూ.10 కోట్ల నిధులు అందించారని తెలిపారు. గుంటూరు కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment