రేపల్లె రూరల్: రేపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 46 రేషన్ డీలర్లు, 3 బై ఫరగేషన్ దుకాణాల భర్తీకి కలెక్టర్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డీవో నేలపు రామలక్ష్మి తెలిపారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడారు. రేపల్లె పట్టణ, మండలంలో 8, నగరంలో 8, చెరుకుపల్లిలో 6, నిజాంపట్నంలో 5, అమర్తలూరు 3, కొల్లూరు 3, వేమూరు 3, భట్టిప్రోలు 5, చుండూరులో 8 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. 29న దరఖాస్తుల పరిశీలించి అదేరోజు అర్హులైన వారి జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఎంపికై న వారికి 30న హాల్‌టికెట్స్ జారీ చేసి, డిసెంబర్ 2న పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. 3న పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రచురణ, 5న ఇంటర్వ్యూలు, 6న అర్హుల తదిజాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు ఇంటర్మీడియట్, 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్లు, వయస్సు ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం (ఓటర్, ఆధార్, పాన్‌కార్డు ఏదైనా), మూడు పాస్‌ఫోటోలు, కుల ధ్రువీకరణ, నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధ్రువీకరణ పత్రం జతచేయాలని తెలిపారు. దివ్యాంగుల కేటగిరికి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.
రేపు బాపట్లలో జాబ్ మేళా
బాపట్ల టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 20న బాపట్ల జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి. ప్రణయ్ తెలిపారు. జాబ్ మేళాకు ఇలాగిరీ సర్వీసెస్ ,ఫైరడేల్ క్యాపిటల్ ,ధరణి రియల్ ఎస్టేట్స్ , సూర్య సంస్థలు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 100కి పైగా ఖాళీలు ఉన్నాయని, జీతం విద్యార్హతను బట్టి సుమారు రూ. 10,000 నుంచి 20,000 వరకు ఉంటుందని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ (కెమిస్ట్రీ), ఏంబీఏ, పీజీ చేసిన 18–30 మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులని పేర్కొన్నారు. రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ , ఆధార్ ఫొటోస్టాట్, పాస్‌పోర్ట్ ఫోటోతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ 9988853335, సెల్ నెంబర్ 9640695229 సంప్రదించాలని తెలిపారు. తొలుత httpr://naipunyam.ap.gov.in/ వెబ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment