మామ, బావ అసభ్య ప్రవర్తనపై ఫిర్యాదు
నగరంపాలెం: మామ, బావ అసభ్య ప్రవర్తనపై కోడలు సోమవారం ఫిర్యాదు చేసింది. మామ వక్రబుద్ధిపై గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందించింది. ఈ సందర్భంగా బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. గుంటూరు రూరల్ గ్రామానికి చెందిన యువతికి తుళ్లూరు మండలానికి చెందిన యువకుడితో గతేడాది నవంబర్‌లో పెళ్‌లైంది. మొదట్లో కాపురం సజావుగా సాగినా అత్తారింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. అధిక కట్నం తేవాలని ఒత్తిడి తీసుకొచ్చేవారు. భర్త విజయవాడలోని ఓ కారు షోరూంలో పనికి వెళ్లేవాడు. ఇదే అదునుగా భావించిన మామ కోడలిపై కన్నేశాడు. ఒంటిపై చేతులేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై భర్త, అత్త దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదు. ఆఖరికి బావ కూడా వెనుక నుంచి పట్టుకునేవాడు. వరస ఘటనలపై ఎవరికై నా చెబితే చంపేస్తామని బెదిరించేవారు. తల్లిదండ్రులకు దృష్టికి తీసుకెళ్లగా, పుట్టింటికి తీసుకొచ్చారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదు. కట్నంతోపాటు శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన భర్త, అత్త, మామ, బావపై చర్యలు తీసుకోవాలని అర్జీలో కోరినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment