అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
బాపట్ల టౌన్: అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏ. ఝాన్సీరాణి డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఝాన్సీరాణి మాట్లాడుతూ అంగనవాడీ మినీ సెంటర్లను మెయిన్‌గా మార్చాలని కోరారు. సెంటర్ల నిర్వహణలో వర్కర్ పని, హెల్పర్ పని ఒక్కరే చేయడం వల్ల పని భారం పెరుగుతోందని తెలిపారు. మినీ వర్కర్‌కు ప్రమోషన్ ఇవ్వాలని జీవో ఉన్నా, సక్రమంగా అమలు కావడం లేదని చెప్పారు. అత్యవసరమైనప్పుడు కూడా మినీ వర్కర్లకు సెలవులు కూడా ఇవ్వడం లేదన్నారు. కనీసం వేసవి సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలు అనుగుణంగా వేతనాలు అందించాలని కోరారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్‌గా మార్చాలని గతంలో 42 రోజుల సమ్మె సమయం సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి. సీతామహాలక్ష్మి, ఎన్. హేమమాలిని,బుజ్జి రత్నకుమారి, శివపార్వతి, వరలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్. మజుందార్ పాల్గొన్నారు.
యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏ. ఝాన్సీరాణి
Comments
Please login to add a commentAdd a comment