పత్తికి మద్దతు ధర చెల్లించాలి
ఆడిట్ కమిషనరేట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు
లక్ష్మీపురం: దేశంలోని 48 సి.జి.ఎస్.టి. ఆడిట్ కమిషనరేట్‌లలో గుంటూరు కమిషనరేట్‌కు యాన్యూవల్ కంపోజిట్ గ్రేడింగ్‌లో 2023–24 ఆర్థిక ఏడాదికి ప్రథమ స్థానం దక్కింది. ఈ మేరకు ఢిల్లీలోని సి.జి.ఎస్.టి ఆడిట్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం గురువారం వివరాలు వెల్లడించింది. వంద మార్కులకు గుంటూరు కార్యాలయం అత్యధికంగా 73.22 సాధించింది. ఇందుకు కారణమైన అధికారులకు ఆ శాఖ చీఫ్ కమిషనర్ సంజయ్ రాతీ, కమిషనర్ పి.ఆనంద్ కుమార్‌లు అభినందించారు.
సత్తెనపల్లి: పత్తి క్వింటాకు రూ.7,521 మద్దతు ధర చెల్లించాలని, పత్తి కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ల్లోనే ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్ చేశారు.సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. నిబంధనల పేరుతో పత్తి కొనుగోలుకు సీసీఐ కేంద్రాలు నిరాకరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిబంధనలను సడలించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర చెల్లించడం లేదని వివరించారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ మాట్లాడుతూ ఈనెల 26న పత్తి రైతులతో కలిసి నరసరావుపేట కలెక్టరేట్ వద్ద భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు కామినేని.రామారావు, సత్తెనపల్లి మండల కార్య దర్శి పెండ్యాల మహేష్‌లు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment