కొనసాగిన శ్రీవిధుశేఖర భారతి స్వామి పర్యటన
నగరంపాలెం: శ్రీ శృంగేరీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీవిధుశేఖర భారతీ స్వామి విజయ యాత్ర మహోత్సవాల్లో భాగంగా నగర పర్యటన మూడో రోజైన శనివారం కూడా కొనసాగింది. సంపత్‌నగర్ శ్రీశృంగేరీ శంకర మఠం శ్రీశారదా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో జగద్గురు మహాస్వామి వారి దివ్య సన్నిధిన కృష్ణ యజుర్వేద హవన పూర్ణాహుతి, కౌథుమ సామవేద హవన పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం సుమారు 150 మంది వేద పండితులతో వేద సభ చేపట్టారు. స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం జస్టిస్ భట్టిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిలు కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఆర్డీఓ కె.శ్రీనివాసరావు వెంట ఉన్నారు. ఆర్ అగ్రహారంలోని శ్రీరామనామ క్షేత్రాన్ని స్వామి సందర్శించారు. శ్రీఆంజనేయస్వామిని దర్శించుకుని, భక్తులు రాసిన శ్రీరామనామ పుస్తకాలను భద్రపరిచిన స్తూపాలకు పుష్పాలను సమర్పించారు. పల్లకి, భవనంలో శంకరకృప వసతి సముదాయాన్ని ప్రారంభించారు. శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment