సాంకేతికతతో వైద్యరంగం కొత్త పుంతలు
గుంటూరు మెడికల్: రానున్న రోజుల్లో రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్‌తో వైద్యరంగం కొత్త పుంతలు తొక్కనుందని డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి పేర్కొన్నారు. యువ వైద్యులు ఈ విప్లవాత్మక మార్పులపై దృష్టి సారించాలని సూచించారు. గుంటూరు మెడికల్ కాలేజ్ జింఖానా ఆడిటోరియంలో జరుగుతున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సులో కీళ్ల మార్పిడిలో రోబోటిక్ పాత్ర అంశంపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రెండు సంవత్సరాల క్రితం వరకు వైద్యరంగంలో రోబోటిక్, ఏఐల పాత్ర అంతంత మాత్రమేనని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రతి విభాగంలోనూ వాటి ముద్ర వేస్తున్నాయని తెలిపారు. ఒక్క కీళ్ల మార్పిడి అంశంలోనే దేశవ్యాప్తంగా 12 వేల రోబోటిక్స్ ఉన్నాయని చెప్పారు. సాంకేతికత వినియోగం పెరిగేకొద్దీ పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్ నరేంద్ర రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment