క్రీస్తు మార్గంలో పయనించాలి
ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్
బాపట్ల: క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా బుధవారం సీబీజడ్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు సందేశం మానవాళి అందరికీ స్ఫూర్తిదాయం అన్నారు. స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ఎం పవిత్రకుమార్ ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించుటతో మానవాళికి ప్రభువు ఆశీర్వాదములను వివరించారు. ఏసుప్రభు గురించి ఎంపీ పలు విషయాలు వివరించారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే వాక్యాన్ని వివరించారు. క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎం.పవిత్రకుమార్‌ను సన్మానించారు. కార్యక్రమంలో సాధు హెర్బర్ట్, కార్యదర్శి క్రిస్టఫర్, రెవరెండ్ రాహుల్ దేవ్, ఎలేషియారావు, రాజు, ఎన్.త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద బుధవారం 1616 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 70 క్యూసెక్కులు, తూర్పు కెనాల్‌కు 67 క్యూసెక్కులు, నిజాంపట్నం కాలువకు 73 క్యూసెక్కులు, కొమ్మమూరు కాలువకు 1095 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment