ముగిసిన ఎన్టీఆర్ కళాపరిషత్ నాటిక పోటీలు
యద్దనపూడి: మండలంలోని అనంతవరంలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటీక పోటీలు శనివారం అర్ధరాత్రి ముగిశాయి. శ్రీసాయి ఆర్ట్స్ కొలకలూరి వారు ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. ద్వితీయ ప్రదర్శనగా యంగ్ థియేటర్ విజయవాడ వారి 27వ మైలురాయి, తృతీయ ప్రదర్శనగా మైత్రీ కళానిలయం గుంటూరు వారి బ్రహ్మస్వరూపం, ఉత్తమ జ్యూరీ ప్రదర్శనగా చైతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారి (ఆ)సత్యం నాటికలు ఎంపికయ్యాయి. ఉత్తమ బాల నటి ఎన్. యస్మిత (నా శత్రువు), ఉత్తమ రచన టి. మాధవ్ (జనరల్ బోగీలు), ఉత్తమ దర్శకత్వం ఎం.ఎస్. చౌదరి (ఐ ఏట్ ఇండియా), ఉత్తమ నటి సురభి ప్రభావతి (జనరల్ బోగీలు), ద్వితీయ నటి సురభి లలిత (నిశి), ఉత్తమ హాస్యనటి జి.వసంత యామిని ( విడాకులు కావాలి), ఉత్తమ విలన్ ఎం.ఎస్. చౌదరి (ఐ ఏట్ ఇండియా), క్యారెక్టర్ యాక్టర్ ఈ. పవన్‌కుమార్ ( 27 వ మైలురాయి), ఉత్తమ నటుడు గోవాడ వెంకట్ (స్వేచ్ఛ), ద్వితీయ ఉత్తమ నటుడు టీవీ పురుషోత్తమం (బ్రహ్మ స్వరూపం), ఉత్తమ సహాయ నటుడు కె. నాగేశ్వరరావు (జనరల్‌బోగీలు)లకు అవార్డులు లభించాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా నూతలపాటి కాళిదాసు, కె. దేవేంద్ర, డాక్టర్ రాయల హరిశ్చంద్ర వ్యవహరించారు. నాటిక పోటీలకు సహకరించిన గ్రామస్తులకు, కళాభిమానులందరికీ అనంతవరం ఎన్టీఆర్ కళాపరిషత్ తరఫున పరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు కృతజ్ఞతలు తెలిపారు. నిర్వాహకులు గుదే తారక రామారావు, కొరటాల వంశీ, మద్దినేని జయరామకృష్ణ, పెడవల్లి శ్రీనివాసరావు, పోపూరి శివసుబ్బారావు, నిమ్మల సాంబశివరావు, మండవ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఉత్తమ ప్రదర్శనగా ‘జనరల్ బోగీలు’ నాటిక
Comments
Please login to add a commentAdd a comment