లౌకిక శక్తులు ఏకం కావాలి
లక్ష్మీపురం: కేంద్రం వైఖరిపై పోరాటానికి లౌకిక శక్తులు ఏకం కావాలని ఆవాజ్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిష్టి అన్నారు. పాత గుంటూరులోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఆవాజ్ కమిటీ గుంటూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు బాషా అధ్యక్షతన జరిగింది. ఇందులో చిష్టి మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా మైనారిటీలకు ఇచ్చిన ప్రత్యేకమైన హామీలు, సూపర్ 6 అమలు కోసం గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు నళినీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో చాపకింద నీరులా జనసేనను అడ్డుపెట్టుకొని బీజేపీ తన మతోన్మాద ఎజెండాను అమలు పరచాలని చూస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంబేడ్కర్‌ను అవమాన పరుస్తూ అమిత్ షా పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంపై వారి వైఖరి, మతోన్మాదంపై వారి నిబద్ధతకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని చెప్పారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రతి పౌరుడికి ఉందన్నారు. చట్టసభల్లో సామాన్యుల గొంతుకగా ఉన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు తిరిగి గెలిపించుకోవాలని కోరారు. అనంతరం 12 మందితో ఏర్పాటైన నూతన కమిటీకి అధ్యక్ష, కార్యదర్శులుగా సుభాని, బాషాలను ఎన్నుకున్నారు.
ఆవాజ్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment