విద్యార్థినికి మంత్రి లోకేష్ అభినందన
మంగళగిరి (తాడేపల్లి రూరల్ ): తెలుగు టైప్‌రైటింగ్ లోయర్ గ్రేడ్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థినిని మంత్రి లోకేష్ అభినందించారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన పరీక్షలో ఆమె ఈ ఘనత సాధించింది. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని యర్రబాలేనికి చెందిన ఆరాధ్యుల హరితసాయి నగరానికి చెందిన టైప్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపల్ మురళీతో కలిసి తాడేపల్లిలోని నారా లోకేష్ నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెను మంత్రి అభినందించారు.
‘మా – ఏపీ’ గుర్తింపు కార్డులు జారీ
తెనాలి: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ – ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ (మా–ఏపీ)లో ఆదివారం వివిధ రంగాలకు చెందిన సినీ రంగ కార్మికులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. సంస్థ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా మాట్లాడుతూ.. గతంలో ఏ శాఖలో ఎవరి దగ్గర పనిచేశారో ఆయా రంగాల సాంకేతిక నిపుణులు ఇచ్చిన అనుభవం సర్టిఫికెట్ల ఆధారంగా గుర్తింపు కార్డులను అందజేస్తున్నట్టు తెలిపారు. కార్డులను అందుకున్న వారిలో కాస్ట్యూమ్ డిజైనర్లు పట్నాల పార్వతి, శ్రీవిద్య, ఫైటింగ్ డివిజనులో శ్రీధర్, కెమెరామెన్ రాజు తదితరులున్నారు.
జాతీయ ప్రతిభా పురస్కారానికి ప్రభావతి ఎంపిక
వేమూరు(భట్టిప్రోలు): భట్టిప్రోలు గ్రామానికి చెందిన సాహితీవేత్త, నంది అవార్డు గ్రహీత దొంతు ప్రభావతి జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికై నట్లు శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న విజయవాడలో తెలుగు కీర్తి జాతీయ ప్రతిభా పురస్కారం అందుకోనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి, సాహితీ, కళా, సేవా రంగాలకు చేస్తున్న సేవలకు గుర్తింపుగా అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment