ఈ యాప్ పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. సింగిల్ విండో సిస్టం ద్వారా ఆన్‌లైన్‌లో ప్రచార వాహనాలు, మైకు, సభలు, సమావేశాలు.. తదితర అనుమతులు పొందేందుకు వీలుంటుంది. ఈ పోర్టల్ వినియోగించుకొని అభ్యర్థులు ఇంటి నుంచే అనుమతులు పొందవచ్చు. సంబంధిత నోడల్ అధికారి, సెక్షన్ అధికారులు, ఐటీ అధికారులు అందుబాటులో ఉంటారు. దరఖాస్తు ఆన్‌లైన్‌లో పొందుపర్చి పత్రాలను పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే అనుమతులిస్తారు.
సభలు, సమావేశాలు నమోదు..
గూగుల్‌ప్లే స్టోర్ ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తాము నిర్వహించే సమావేశం, తమకు ఏ విధమైన అనుమతులు అవసరమో వాటిని యాప్‌లో నమోదు చేయాలి. దరఖాస్తు ఎన్నికల అధికారులకు చేరిన 48 గంటల్లోనే అనుమతులు లభిస్తాయి. సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయంగా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. యాప్ ద్వారా సభా నిర్వహణ, సమావేశాల ఏర్పాటు, ర్యాలీలు, కార్లు, బైక్‌లు వినియోగించాల్సి ఉంటే ఆ వివరాలు, తాత్కాలిక ఎన్నికల కార్యాలయాల ఏర్పాట్లు, లౌడ్ స్పీకర్లు, జెండాలు, పోస్టర్ల వినియోగం, ఇంటింటి ప్రచారం తదితరాలు పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment