పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
ప్రజావాణికి సకాలంలో హాజరవ్వాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని కోరారు.
మున్సిపల్ ప్రత్యేక
అధికారిగా విద్యాచందన
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో రెండు మున్సిపాలిటీలకూ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ స్పెషలాఫీసర్ పాలన కొనసాగనుంది.
Comments
Please login to add a commentAdd a comment