పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
టేకులపల్లి : ప్రభుత్వం అందిస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని కోయగూడెంలో ఆదివారం వారు పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అర్హులందరికీ ఈ పథకాలు అందుతాయన్నారు. తొలి విడతలో రాలేదని ఎవరూ నిరాశ చెందవద్దని సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు రాత్రీ పగలు తేడా లేకుండా సర్వే చేసిన పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓ, తహసీల్దార్లతో పాటు పలువురు అధికారుల సేవలు అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శ్రీరామ్, ఎంపీడీఓ రవీంద్రరావు, తహసీల్దార్ నాగభవాని తదితరులు పాల్గొన్నారు.
పూబెల్లిలో..
ఇల్లెందురూరల్: ప్రజల ఆకాంక్షలను నెరవర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోరం కనకయ్య అన్నారు. మండలంలోని పూబెల్లిలో నాలుగు సంక్షేమ పథకాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. గ్రామంలో 90 మందికి ఇందిరమ్మ ఇళ్లు, 45 మందికి రేషన్‌కార్డులు, 9 మందికి ఆత్మీయ భరోసా, 344 మందికి రైతు భరోసా పథకాల మంజూరు పత్రాలు అందించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్‌సింగ్, ఏడీఏ లాల్‌చంద్, మండల ప్రత్యేకాధికారి విజయ పాల్గొన్నారు.
ప్రజాపాలనలో ప్రతి ఒక్కరికీ లబ్ధి
భద్రాచలంటౌన్/దుమ్ముగూడెం : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో పేదలందరికీ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకురుతుందని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ అన్నారు. పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీలో ఐటీడీఏ పీఓ రాహుల్‌తో కలిసి, దుమ్ముగూడెం మండలం పెద్దకమలాపురంలో అధికారులతో కలిసి ఆదివారం ఆయన అర్హులకు సంక్షేమ పథకాల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, దుమ్ముగూడెం మండల ప్రత్యేకాధికారి హరిలాల్, తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీఓ రామకృష్ణ, వ్యవసాయాధికారి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌తోనే సంక్షేమ పథకాలు
అశ్వారావుపేటరూరల్/చండ్రుగొండ/ములకలపల్లి/దమ్మపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఆదివారం ఆయన అశ్వారావుపేట మండలం పాత రెడ్డిగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురంలో ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి, చండ్రుగొండ మండలం బెండాలపాడులో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ములకలపల్లి మండలం చాపరాలపల్లి, దమ్మపేట మండలం మొండివర్రె గ్రామాల్లో స్థానిక అధికారులతో కలిసి నాలుగు సంక్షేమ పథకాల మంజూరుపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తొలిజాబితా పేరు రాలేదని ఎవరూ అందోళన చెందవద్దని, ఈ పథకాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. అర్హులైన వారికి అన్యాయం జరిగితే అధికారులను కాదు.. తనను నిలదీయాలని అన్నారు. అధికారులు కూడా పారదర్శకంగా పనిచేయాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారులు ప్రదీప్ కుమార్, సంజీవరావు, తహసీల్దార్లు కృష్ణ ప్రసాద్, జగదీశ్వర్‌ప్రసాద్, సంధ్యారాణి, గుడ్ల పుల్లారావు, ఎంపీడీఓలు మహాలక్ష్మి, బయ్యారపు అశోక్, రేవతి, ఎంపీడీవో రవీంద్రరెడ్డి, ఏపీఓ రామచంద్రరావు, ఎంపీఓ లక్ష్మయ్య, ఏఓలు శివరాంప్రసాద్, అరుణ్‌బాబు, చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, సొసైటీ డెరెక్టర్ అనుమల సత్యనారాయణ, దమ్మపేట డిప్యూటీ తహసీల్దార్ వాణి పాల్గొన్నారు.
అర్హులందరికీ పథకాలు
మణుగూరు టౌన్/పినపాక/అశ్వాపురం/కరకగూడెం : M>…{VðS-‹Ü ´ëÌS-¯]l-ÌZ AÆý‡$á-ÌS…§ýl-ÇMîS çÜ…„óSÐ]l$ ç³£ýl-M>Ë$ A…§ýl$-™éĶæ$° GÐðl$ÃÌôæÅ ´ëĶæ$… Ððl…MýS-sôæ-ÔèæÓÆý‡$Ï A¯é²Æý‡$. Ð]l$×æ$-VýS*Æý‡$ Ð]l$…yýl-ÌS… ÌS…MýS Ð]l$ÌêÏÆý‡…, í³¯]l-´ëMýS Ð]l$…yýl-ÌS… ¿¶æ*´ë-ÌS-ç³-r²…, AÔ>Ó-ç³#Æý‡… Ð]l$…yýl-ÌS… ™èl$Ð]l$Ã-ÌS-^ðl-Æý‡$Ð]l#, MýSÆý‡-MýS-VýS*-yðl… Ð]l$…yýl-ÌS… Æó‡VýS-âýæÏ-ÌZ B¨ÐéÆý‡… BĶæ$¯]l ¯éË$VýS$ çÜ…„óSÐ]l$ ç³£ýl-M>ÌS ÌS¼®§éÆý‡$-ÌSMýS$ Ð]l$…þÆý‡$-ç³-{™é-Ë$ A…§ýl-gôæ-Ô>Æý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> Ð]l*sêÏ-yýl$™èl*.. VýS™èl ´ëÌS-MýS$-Ë$ Æó‡çÙ¯ŒS M>Æý‡$z A¯ól 糧鰲 Ð]l$Ç_ HâýæÏ ™èlÆý‡-ºyìl {ç³fË$ ™èlçßæ-ïÜÌêªÆŠ‡ M>Æ>Å-ÌS-Ķæ*ÌS ^èl$r*t †´ëµ-Æý‡°, ™èlÐ]l$ {糿¶æ$-™èlÓ… HÆý‡µ-yìl¯]l çÜ…Ð]l-™èlÞ-Æý‡…-ÌZõ³ çÜ$Ð]l*Æý‡$ 60 Ô>™èl… Ð]l$…¨MìS Æó‡çÙ¯ŒS M>Æý‡$z-Ë$ Ð]l$…þÆý‡$ ^ólçÜ$¢-¯é²-Ð]l$° ^ðl´ëµÆý‡$. BĶæ* M>Æý‡Å-{MýS-Ð]l*-ÌZÏ A§ýl¯]lç³# MýSÌñæMýStÆŠæḥ ѧéÅ^èl…§ýl¯]l, BÈzK §éÐðl*-§ýl-ÆŠ‡-Æ>Ð]l#, í³¯]l-´ëMýS Ð]l$…yýlÌS {ç³™ólÅMýS A«¨M>Ç ™é™é Æ>Ð]l#, ™èlçßæ-ïÜÌêªÆý‡$Ï Æ>çœ$-Ð]l-Æð‡yìlz, ¯]lÆó‡-‹Ù, çÜÓÆý‡~-ÌS™èl, ¯éVýS {ç³Ý맊æ, G…ï³-yîl-KË$ }°ÐéçÜ-Æ>Ð]l#, Æ>Ð]l$-MýS–çÙ~, Ð]lÆý‡-{ç³-Ý맊æ, MýS$Ð]l*-ÆŠæ, G…ï³-KË$ Ððl…MýS-sôæ-ÔèæÓÆý‡$Ï, Ððl…MýS-sôæ-ÔèæÓ-Æý‡-Æ>Ð]l#, Ð]l¬™éÅ-ÌS-Æ>Ð]l# ´ëÌŸY-¯é²Æý‡$.
కలెక్టర్ పాటిల్, ఎమ్మెల్యే కోరం
Comments
Please login to add a commentAdd a comment