పిల్లలు ఉన్నత చదువులకు..
సూర్యరశ్మితో పని చేసే బోర్లతో ప్రతి సంవత్సరం పంటలు సాగు చేస్తున్నాం. గత సంవత్సరం నాలుగు ఎకరాల్లో మిర్చి వేశాను. మంచి ఆదాయం రావడంతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నాను. ఈ ఏడాది మిర్చి కోయిస్తున్నారు. సోలర్ సిస్టమ్ లేనప్పుడు బీడు భూములు ఉండేవి. జలప్రభ మా పాలిట వరంగా మారింది. –మూడ్ వీరభద్రం, మైలారం
లాభాలు వస్తున్నాయి..
అప్పటి ఎమ్మెల్యే జలగం వెంకటరావు సహకారంతో బీడు భూములు నేడు కాసులు కురిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం మిర్చి, మొక్కజొన్న పంటలు సాగు చేస్తున్నాం. గతేడాది ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వచ్చింది. టమాటాలు కూడా పండిస్తున్నారు. ఈ ఏడాది మొక్కజొన్న వేశాను. కంకులు బజార్‌లోకి పంపించి విక్రయిస్తున్నాము. లాభాలు వస్తున్నాయి.
– వజ్జా రాజు, రైతు
●
Comments
Please login to add a commentAdd a comment