గాలిదుమారం.. వడగళ్ల వాన | Sakshi
Sakshi News home page

గాలిదుమారం.. వడగళ్ల వాన

Published Sun, May 5 2024 12:45 AM

గాలిదుమారం.. వడగళ్ల వాన

గుండాల: జిల్లాలో పలుచోట్ల శనివారం గాలిదుమారం వచ్చింది. వడగళ్ల వాన కురిసింది. ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో గాలి దుమారంతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాన పడగా, ఈదురుగాలులకు ఇళ్లపై కప్పులు లేచిపోయాయి. జాగ్గాయిగూడెం గ్రామానికి చెందిన మొల్కం రామకృష్ణ ఇంటిపై పిడుగుపడడంతో గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మామిడికాయలు నేలరాలాయి.

చండ్రుగొండలో..

చండ్రుగొండ : మండలంలో శనివారం వడగండ్లతో కూడిన భారీ వర్షం పడింది. వరిపంటకు అక్కడక్కడా పాక్షిక నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా వాతావారణం చల్లబడటంతో ఎండి వేడిమితో అల్లాడుతున్న జనం కాస్త ఉపశమనం పొందారు.

Advertisement
Advertisement