పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయాన్ని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజాది కార్యక్రమాల్లో ఈఓ ఎన్.రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా అందజేయాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు.
నేడు ఐటీడీఏలో
గిరిజన దర్బార్
భద్రాచలం: భద్రాచలం ఐటీడీఏలో సోమవారం జరిగే గిరిజన దర్బార్‌కు అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలు వివరించి పరిష్కరించుకోవాలని కోరారు.
కార్మికుల అనుమతి లేకుండా రికవరీ చేయొద్దు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికుల అనుమతి లేకుండా వారి పే షీట్‌లో యూనియన్ చందా రికవరీ చేయటం సరికాదని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్ నెల జీతంలో ఒక్కొక్కరి జీతం నుంచి రూ. 500ను టెంపుల్ రికవరీ కోడ్ 1835 నంబర్‌పై రికవరీ చేసినట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఆథరైజేషన్, స్టేట్‌మెంట్‌తో సరిచూడకుండా రికవరీ చేయొద్దని కోరారు.
ఐటీడీఏ సత్తా చాటాలి
పాల్వంచరూరల్: రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలం ఐటీడీఏ సత్తా చాటాలని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్( డీడీ) మణెమ్మ సూచించారు. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాల్లో పాల్గొనున్న 138 మంది క్రీడాకారులకు కిన్నెరసాని క్రీడాపాఠశాలలో గత నెల 28 నుంచి ఆదివారం వరకు కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రస్థాయి క్రీడల్లో అత్యధిక బహుమతులను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ బుల్లి గోపాల్‌రావు, ఏఎస్‌ఓ వెంకటనారాయణ, పీడీ హరికృష్ణ, పీఈటీలు వెంకటేశ్వర్లు, వార్డెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment