ముగిసిన కేయూ అథ్లెటిక్స్ మీట్
● పురుషుల చాంపియన్‌గా కేఎండీసీ జట్టు ● మహిళల చాంపియన్‌గా కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాల
ఖమ్మం స్పోర్ట్స్ : ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీ పరిధి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి బి.వెంకయ్య, డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, టోర్నమెంట్ చైర్మన్, పీజీ కళాశాల ప్రిన్పిపాల్ డాక్టర్ సీహెచ్ రవికుమార్, సీనియర్ అథ్లెటిక్స్ కోచ్ ఎండీ. గౌస్, పీడీల సంఘం కార్యదర్శి డాక్టర్. బి.వెంకన్న, సీనియర్ పీడీలు ఏటీబీటీ ప్రసాద్, సావిత్రి, పి.శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, జె.ఉపేందర్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. పురుషుల ఓవరాల్ చాంపియన్‌గా ఖమ్మం కవిత మెమోరియాల్ డిగ్రీ కళాశాల(అటానమ్) జట్టు 32 పాయింట్లతో నిలిచింది. మహిళల విభాగంలో కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కళాశాల జట్టు 48 పాయింట్లతో ట్రోఫీని కై వసం చేసుకుంది. వ్యక్తిగత చాంపియన్‌లుగా కేఎండీసీ ఖమ్మంకు చెందిన ఎ.గౌతమ్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలకు చెందిన ఎ.మైథీలీని ఎంపిక చేశారు.
విజేతలు వీరే..
పురుషుల విభాగం 200 మీటర్ల పరుగులో ఎ.గౌతమ్, బి. కౌషయ్య(ఎల్‌బీ కాలేజీ వరంగల్) పి.సాయితేజ, 800 మీటర్ల పరుగులో ఎస్.గోపిచంద్(కేఎండీసీ), జి.ఉదయ్ కిరణ్(ఏబీవీ జనగాం), బి.నరేష్( కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్), 4x 400 రిలేలో ఏబీవీ జనగాం, కిట్స్ వరంగల్, కేఎండీసీ వరంగల్, 4x100 రిలేలో కేఎండీసీ, మహిళల 200 మీటర్ల పరుగులో ఎ.మైథిలి, ఆర్.డిసౌజ, ఎం.మనీషా, 4x100 రిలేలో సింగేణి మహిళా కళాశాల కొత్తగూడెం, టీటీడబ్ల్యూఆర్‌డీసీ కొత్తగూడెం, టీటీ డబ్ల్యూఆర్‌డీసీ ఖమ్మం, 800 మీటర్ల పరుగులో ఎం.ఇందు, ఎం.టాబు, కె. అశ్విన్, 4x400 రిలేలో సింగరేణి మహిళా కళాశాల కొత్తగూడెం, టీటీడబ్ల్యూఆర్‌డీసీ ములుగు, టీటీడబ్ల్యూఆర్‌డీసీ ఉట్నూర్ వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment