● కనీస సౌకర్యాలు లేని పల్లెల నుంచి వచ్చినా విరామమెరుగక పోరాటం ● కష్టాలకు ఎదురొడ్డి విజేతలుగా నిలిచిన పలువురు ● ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారులుగా విధులు
● పది కి.మీ. సైకిల్‌పై పయనం
పాల్వంచరూరల్: నిత్యం పది కి.మీ. మేర సైకిల్ తొక్కుతూ వెళ్లి చదువుకునేవాడిని. కామారెడ్డి మండలం మోషంపూర్‌కు చెందన బొర్రగౌడ్ – బుచ్చమ్మ మా అమ్మానాన్నలు. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మోషంపూర్‌లో, 8 నుంచి 10 వరకు చిన్నమల్లారెడ్డిలోని అమ్మమ్మ ఇంటి వద్ద, ఇంటర్, డిగ్రీ కామారెడ్డిలో చదివాను. అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నప్పుడు ప్రతిరోజు పది కి.మీ. సైకిల్‌పై పాఠశాలకు వెళ్లేవాడిని. స్నేహితులతో కలిసి సెలవుల్లో మాత్రమే ఆటకు వెళ్లేవాడిని తప్ప మిగతా రోజుల్లో చదువే లోకంగా ఉండేది. ఈత పోటీల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పతకాలు సాధించా. చిన్నప్పుడు ఈత సరదాగా నేర్చుకోగా ఇప్పుడు ఉద్యోగుల క్రీడాపోటీల్లోనూ పతకాలు సాదించగలుగుతున్నా.
–జి.కృష్ణగౌడ్, అటవీశాఖాధికారి,
భద్రాద్రి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment