పీజీ పూర్తి కాగానే స్టడీ సర్కిల్‌లో చేరారు బలరాంనాయక్. కోచింగ్ సమయంలో క్షణం వృథా చేయకుండా ఉదయం నుంచి రాత్రి రెండు గంటల వరకు, కనీసం ఇంటికి వెళ్లకుండా సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. దీంతో మొదటి ప్రయత్నంలోనే 2010లో సివిల్స్‌కు ఎంపికై ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో జాయిన్ అయ్యారు. తొలుత మేడ్చల్‌లో సెంట్రల్ కస్టమ్స్ డివిజన్ అధికారిగా, ఆ తర్వాత ముంబైలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. 2017లో సింగరేణిలో ఫైనాన్స్ డైరెక్టర్‌గా చేరి, డైరెక్టర్(పా)గా సేవలు అందించి ప్రస్తుతం సింగరేణి సీఎండీగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఖర్చుల కోసం కూలి పని చేసి రూ.25 సంపాదించిన వ్యక్తి నేడు రూ.40 వేల కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన కంపెనీకి బాస్‌గా అనేక మందికి స్ఫూర్తినిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment