● జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌లో ఐటీడీఏ పీఓ రాహుల్ ● ఏర్
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలోని గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్‌లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు రెండోరోజు మంగళవారం పలు అంశాలపై నమూనాలు ప్రదర్శించారు. ఎర్రగుంట జెడ్పీ పాఠశాల స్కౌట్ విద్యార్థులు ఏర్పాటుచేసిన క్యాంప్ ఫైర్ ను ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు భవిష్యత్ మేధావులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆదివాసీ గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, విద్యార్థుల కళా ప్రదర్శనలను తిలకించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. సైన్స్‌ఫేర్‌లో రూపొందించిన ప్రయోగాత్మక నమూనాలు విద్యార్థుల మేధాశక్తికి అద్దం పడుతున్నాయని అన్నారు. జిల్లా విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌లు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతాయన ఆశాభావం వ్యక్తం చేశారు. డీఈఓ వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ.. ఇక్కడి సైన్స్‌ఫేర్‌లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని అన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన వారిని జాతీయస్థాయికి పంపిస్తారని, అక్కడ ఉత్తమ ప్రదర్శనలకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష బహుమతి అందిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టుల పరీశీలకులు సుకృత్, న్యాయనిర్ణేతలు మాధవి, జగన్మోహన్‌రాజు, ప్రిన్స్‌పాల్ బురాన్, ఎంఈఓ ఆనంద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment