గజ గజ..!
చుంచుపల్లి: జిల్లాలో చలి తీవ్రత మొదలైంది. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం భారీగా పడిపోతున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత చలి తీవ్రమవుతోంది. మొన్నటివరకు 35 డిగ్రీలకు పైగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 30, 32 డీగ్రీలకు చేరుకున్నాయి. ఇక రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 15, 16 డిగ్రీలకు చేరుతోంది. పలుచోట్ల ఉదయం పొగమంచు కూడా కురుస్తోంది. ఉదయమే పనులకు వెళ్లేవారు, ద్విచక్రవాహనదారులు పొగమంచు, చలిగాలులతో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురిసినందున అలస్యంగా మొదలైన చలి తీవ్రత రాబోయే రోజుల్లో అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. చలి తీవ్రత పెరుతున్నందున పిల్లలు, వృద్ధులు, అస్తమా వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, చలికాలం ప్రారంభం కావడంతో మధ్యప్రదేశ్, నేపాల్, రాజస్థాన్ తదితర ప్రాంతాల వ్యాపారులు కొత్తగూడెంలో ఇప్పటికే స్వెట్టర్లు, రగ్గులు, ఉన్ని దుప్పట్లు, మఫ్లర్లు వంటివి విక్రయిస్తున్నారు.
జిల్లాలో పెరుగుతున్న చలి
Comments
Please login to add a commentAdd a comment