బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్..
ములకలపల్లి: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే పాలకపక్షం కాంగ్రెస్ పాలన సాగిస్తోందని, ఎన్నికల హామీల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ విమర్శించారు. మండల పరిధిలోని మాధారం గ్రామంలో గురువారం నిర్వహించిన పార్టీ 9వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు సమయం కేటాయించలేదని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వామపక్ష నాయకులతో ముఖాముఖి కలిసినా ఫలితమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు విన్నవించినా స్పందించట్లేదని ఆరోపించారు. మూడు పంటలు పండే సేద్యపు భూముల్లో ఫ్యాక్టరీ పెట్టాలనే దురాలోచన వల్లే లగచర్ల సంఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. తొలుత ప్రధాన కూడలిలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, సభాస్థలి వరకు ప్రదర్శన చేశారు. సీతారాం ఏచూరితోపాటు పలువురు అమవీరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే. రమేశ్, కాసాని ఐలయ్య, యలమంచిలి రవికుమార్, మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, పిట్టల అర్జున్, బి.చిరంజీవి, మోరంపూడి శ్రీనివాసరావు, దొడ్డా లక్ష్మీనారాయణ, వెంకటరత్నం పాల్గొన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ
సభ్యుడు పోతినేని సుదర్శన్
Comments
Please login to add a commentAdd a comment