సుమారు సంవత్సర కాలం తర్వాత సింగరేణిలో డైరెక్టర్ పా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో నాయకులు కార్మికులకు ఇచ్చిన హామీలైన సొంతింటి కల నెరవేర్చాలి. ఇతర కార్మికులకు లాభం చేకూర్చే పలు అంశాలపై చర్చించి న్యాయం చేయాలి. మూడు మాసాలకోసారి జరిగే సమావేశాలను తీవ్ర జాప్యం చేశారు. ఇకనైనా సకాలంలో నిర్వహించాలి.
–మందా నర్సింహారావు,
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి
మారుపేర్లపై చర్చించాలి
డైరెక్టర్ పా స్థాయిలో ఈ నెల 28న సింగరేణి ప్రధాన కార్యాలయంలో జరిగే స్ట్రక్చరల్ సమావేశంలో మారుపేర్ల సమస్యపై చర్చించాలి. విజిలెన్స్ విచారణలో పెండింగ్‌లో ఉన్న సుమారు 500 దరఖాస్తులను పరిష్కరించి, డిపెండెంట్ల కుటుంబాలకు న్యాయం చేయాలి. డిపెండెంట్ ఉద్యోగ దరఖాస్తుకు కాలపరిమితి ఎత్తివేయాలి. డిస్మిస్డ్ కార్మికులకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద అవకాశం కల్పించాలి.
–ఆంతోటి నాగేశ్వరరావు,
అసోషియేషన్ జనరల్ సెక్రటరీ
Comments
Please login to add a commentAdd a comment