జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మోడల్ స్కూల్, కస్తూర్బా, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, కళాశాలలు అద్దె భవనాలు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఇరుకుగదుల్లో విద్యాభ్యాసం చేస్తూ హాస్టళ్లలో అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. అద్దె భవనాలకు కూడా ప్రభుత్వం రూ.లక్షల్లో అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అన్ని గురుకులాలు కలిసి ఒకే ప్రాంగణంలోకి వస్తే సౌకర్యాలు, విద్యాభ్యాసం మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమీకృత గురుకులాల నిర్మాణం పూర్తయితే, ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల విద్యార్థులంతా సమీకృత గురుకులంలో చదువుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment