చుంచుపల్లి: మహిళ మెడలో గొలుసు చోరీచేసిన ఘటన మండలంలోని బాబూక్యాంపులో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబూక్యాంప్‌లో నివాసముండే పద్మ నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
గంజాయి సేవిస్తున్న యువకుల అరెస్ట్
దమ్మపేట: గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేసిన ఘటన మండలంలోని పార్కలగండిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని ఎర్రగుంపు గ్రామానికి చెందిన తాటి సాయికృష్ణ, బైట ఆనంద్, చిల్లగుంపు గ్రామానికి చెందిన కుంజా కిశోర్ పార్కలగండి శివారులోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు కింద కూర్చొని గంజాయి తాగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24 వేల విలువైన 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి గంజాయిని కొనుగోలు చేసినట్లు యువకులు అంగీకరించగా ఈ కేసులో మరో ఆరుగురిని పట్టుకోవాల్సి ఉందని ఎస్‌ఐ వివరించారు. కానిస్టేబుళ్లు వీర, లక్ష్మణ్ ఉన్నారు. కేసు నమోదు చేశామని సీఐ కరుణాకర్ వెల్లడించారు.
గంజాయి విక్రయిస్తున్న యువకులు...
పాల్వంచ: గంజాయి విక్రయిస్తున్న యువకులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని వనమాకాలనీ సమాధుల ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ సుమన్ దాడి చేసి, జాన్ పీటర్, దామర్ల ఉదయ్‌ను పట్టుకున్నారు. జెట్టి ప్రణయ్‌కుమార్ పరారయ్యాడు. ప్రశాంత్ (బాబీ) అనే వ్యక్తికి కూడా ఇందులో హస్తం ఉన్నట్లు తేలింది. పట్టుకున్న ఇద్దరి నుంచి 480 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దామిని దాస్ నుంచి గంజాయిని తెచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment