ఆదివాసీల అభివృద్ధికి కృషి చేయాలి
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజన నాయకులు తమ జాతి అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. పట్టణంలోని గిరిజన అభ్యుదయ భవన్‌లో గురువారం జరిగిన జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘాన్ని 1974లో స్థాపించామని, ఈ సంఘానికి తాను ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పని చేశానని చెప్పారు. అనేక ఆదివాసీ అభివృద్ధి పనులతో పాటు వారి ఉనికి కోసం కృషి చేశానని పేర్కొన్నారు. సంఘ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని సూచించారు. సమావేశంలో నాయకులు చందా లింగయ్యదొర, పాయం సత్యనారాయణ, సారయ్య దొర, ఝాన్సీరాణి, చౌదరి లక్ష్మణరావు, అరుణ్ కుమార్, రమణాల లక్ష్మయ్య, ఉపేందర్, చిడం జంగు, మోకాళ్ల శ్రీనివాసరావు, తాటి వెంకటేశ్వర్లు, చీమల నర్సిరావు, పాపారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment