ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు భద్రాద్రి జిల్లా సుజాతనగర్‌లో సెంట్రల్ లైటింగ్‌ను ప్రారంభిస్తారు. ఆతర్వాత పాల్వంచ మండలం ప్రభాత్‌నగర్ వద్ద యానంబైల్–జిన్నగట్ట మధ్య హై లెవల్ బ్రిడ్జి, పాల్వంచ మండలం పాండురంగాపురంలో బీటీ రోడ్డు, లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండలో బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ సమీపాన కమ్యూనిటీ హాల్, రైల్వేస్టేషన్ నుంచి ఎదురుగడ్డ వరకు విస్తరించిన రహదారిని ప్రారంభించారు. అలాగే, సాయంత్రం ఖమ్మం కలెక్టరేట్‌లో మున్నేటిపై రిటైనింగ్ వాల్ నిర్మాణంపై అధికారులతో పొంగులేటి సమీక్ష నిర్వహిస్తారు. ఆతర్వాత ఖమ్మం రూరల్ మండలంలోని ఎం.వీ.పాలెం, తనగంపాడు, కాచిరాజుగూడెం, ఆరెకోడుల్లో రహదా రుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment