పటేల్ స్టేడియంలో క్రీడోత్సాహం
●
పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు
కొద్దిరోజులుగా ప్రణాళికతో వ్యవహరిస్తూ టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. పది జిల్లాల నుంచి బాలికల జట్లు కూడా వచ్చినందున వసతి విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. ఖమ్మం కీర్తిని ఇనుపడింపచేసేలా టోర్నీ నిర్వహణకు పలు కమిటీలను ఏర్పాటు చేశాం.
– టి.సునీల్ కుమార్‌రెడ్డి, డీవైఎస్‌ఓ, ఖమ్మం
బలంగా ఖమ్మం జట్లు
వాలీబాల్ టోర్నీలో పాల్గొంటున్న ఖమ్మం జట్లు బలంగా ఉన్నాయి. ఈసారి కప్ గెలుస్తామనే నమ్మకం ఉంది. గత విజయాలు, అనుభవాల ఆధారంగా ఈసారి ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించాం. సొంత జిల్లాలో జరుగుతున్న పోటీల్లో జయకేతనం ఎగురవేయడమే లక్ష్యం.
– ఎం.డీ.అక్బర్ అలీ, కోచ్, ఖమ్మం
మొత్తం 46 మ్యాచ్‌లు
రాష్ట్ర వాలీబాల్ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో కలిపి 46 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతీ అంశంలో టెక్నికల్ కమిటే బాధ్యతగా వ్యవహరిస్తూ పర్యవేక్షిస్తోంది. ఎక్కడా లోపాలు ఎదురుకాకుండా నిపుణులైన రెఫరీలు, లైన్ ఎంపైర్లు, స్కోరర్లను నియమించాం.
– గణపతి, వాలీబాల్ టెక్నికల్ రాష్ట్ర బోర్డు చైర్మన్
ఆటంకం లేకుండా ఫ్లడ్‌లైట్లు
ప్రతిరోజు ఫ్లడ్ లైట్ల వెలుతురులో మ్యాచ్‌ల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. పోటీలకు వచ్చిన క్రీడాకారులు ఇక్కడి ఏర్పాట్లను చూసి భేష్ అంటున్నారు. రెఫరీలకు సూచనలు చేస్తూ, మ్యాచ్ పూర్తి కాగానే కాస్త విరామంతో ఇంకో మ్యాచ్‌లు మొదలయ్యేలా పర్యవేక్షిస్తున్నాం.
– రవీందర్‌రెడ్డి, టోర్నీ టెక్నికల్ కన్వీనర్
గెలిచి సత్తా చాటేలా...
రాష్ట్రస్థాయి పోటీల్లో మా జిల్లా బాలికల జట్టు విజయం సాధించేలా తర్ఫీదు ఇచ్చాం. కప్ మాకు వచ్చినా, రాకున్నా ప్రత్యర్థి జట్లను పటిష్టంగా ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించాం. మా బాలికల జట్టు బలంగా ఉంది. క్రీడాకారులు కప్ సాధించాలనే తపనతో సిద్ధమయ్యారు.
– ఎం.వీరస్వామి, కోచ్, నల్లగొండ
పటిష్టమైన వ్యూహాలు
రాష్ట్రస్థాయి పోటీల్లో మన జిల్లా జట్టే గెలుస్తుంది. సీనియర్ వాలీబాల్ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకున్నాం. జట్టులో మంచి బూస్టర్, సెంటర్ క్రీడాకారిణులు ఉండడం కలిసొచ్చే అంశం. పక్కా ప్రణాళికతో అడుగులు వేసేలా వ్యూహాలు రూపొందించినందున తప్పక గెలుస్తాం.
– బి.అంబిక, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment