ఖమ్మంసహకారనగర్: సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శుక్రవారం ‘నిధి ఆప్ కే నికట్’ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రబీలాల్‌దాస్, కె.సునీల్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులకు ఆన్‌లైన్ సేవల విధివిధానాలు, కొత్త సంస్థల యజమానులకు పరిచయం, పెన్షనర్ల సమస్యల పరిష్కారం ఉంటుందని వెల్లడించారు. ఖమ్మం జిల్లావాసుల కోసం ఖమ్మంలోని మమత ఎడ్యుకేషనల్ సొసైటీలో, భద్రాద్రి జిల్లా వాసులకు ఇల్లెందులోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 9–15నుంచి సాయంత్రం 4గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment