వాతావరణ ం
జిల్లాలో శుక్రవారం ఎండ తీవ్రత అధికంగానే ఉంటుంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో చలి ప్రభావం కనిపిస్తుంది.
● బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభం కానున్న పూజాదికాలు ● రెండు గంటలకు పైగా రామయ్యకు ప్రత్యేక పూజలు
8లో
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున శ్రీ సీతారామచంద్రస్వామి వారు భక్తులకు ఉత్తర ద్వారంలో దర్శనమివ్వనున్నారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు ఇప్పటికే భద్రగిరికి పోటెత్తారు.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
వేద మంత్రాల నడుమ..
ముక్కోటి ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో ప్రత్యేక వాహనంపై ఆశీసులైన లక్ష్మణ సమేత సీతారాములను ఉత్తర ద్వారం దగ్గర కొలువుదీరుస్తారు. వైకుంఠ ఏకాదశి వైభ వం, మంగళ వాద్యఘంట, వేద పారా యణం అనంతరం.. వినతాసుత వాహన కీర్తన నాదస్వరం, ఆరాధన, శ్రీరామ షడాక్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన వంటి పూజాదికాలు నిర్వహిస్తారు. ఉత్తర ద్వార దర్శన ప్రాశస్థ్యాన్ని స్థానాచార్యులు స్థలశాయి వివరిస్తారు. ఆ తర్వాత 108 ఒత్తులతో హారతినిస్తూ శరణాగతి గద్య విన్నపం చేపడతారు. చివరగా కోదండపాణి కీర్తన ఆలపిస్తూ వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు.
పూజా విశేషాలు ఇలా..
● తెల్లవారు జామున 3 నుంచి 4–30 గంటల వరకు సంగీత కళాకారులు, దేవస్థానం హరిదాసులచే కీర్తనాలాపనలు
● 4–30 నుంచి 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి వైభవం
● 5 నుంచి 5–30 గంటల వరకు వివిధ మంగళ వాయిద్యాలు, వేదపారాయణం, వినతాసుత వాహన కీర్తన నాదస్వరం, శ్రీరామ షడాక్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన
● ఉదయం 5.30 నుంచి 5–40 వరకు ఉత్తర ద్వార దర్శన విశిష్టత వివరణ, 108 ఒత్తులతో హారతి, శరణాగతి గద్యవిన్నపం
● 6గంటలకు ఉత్తర ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటుండగా ధూపాన్ని చీల్చుకుంటూ హారతి వెలుగులు.. ఆ తర్వాత లక్ష్మణ సమేత సీతారాముల వారి దర్శనం
Comments
Please login to add a commentAdd a comment