పారాలీగల్ వలంటీర్ల బాధ్యత కీలకం
కొత్తగూడెంటౌన్: సమాజంలో పారా లీగల్ వలంటీర్ల బాధ్యత కీలకమైందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. వలంటీర్లకు రెండు రోజులుగా జిల్లా కోర్టులో శిక్షణ తరగతులు నిర్వహించగా, గురువారం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని వృద్ధాశ్రమాలు, మానసిక వికాస కేంద్రాల్లో మెడికల్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని, వైద్య, న్యాయపరంగా ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతీ పేదవాడికి న్యాయం జరిగేలా వలంటీర్లు వారధిగా పని చేయాలని కోరారు. కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.పురుషోత్తమరావు, డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్‌రావు, న్యాయవాదులు జి.రామచంద్రారెడ్డి, మారపాక రమేష్, షాజహాన్ పర్వీన్, జి.సునంద, మెండు రాజమల్లు, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్స్ జి.నాగస్రవంతి, జ్యోతి, విశ్వకర్శ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి భానుమతి
Comments
Please login to add a commentAdd a comment