ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఇల్లెందు/ఇల్లెందురూరల్/టేకులపల్లి/గుండాల : ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇల్లెందు, టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సీఆర్‌టీలకు, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరారు. అన్ని గురుకుల పాఠశాలల్లో రెండు డిప్యూటీ వార్డెన్ పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయులు తమ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. తాను విజయం సాధిస్తే జీఓ 317 బాధిత ఉపాధ్యాయ సమస్యలు పరిస్కారానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖలో పండిట్, పీఈటీ అప్‌గ్రేడ్ సమస్యకు పరిష్కారం చూపిస్తానన్నారు. ఆయా కార్యక్రమాల్లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, కార్యదర్శులు పి.జయరాజు, హతీరామ్, ఇల్లెందు మండల అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు, వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు కృష్ణవేణి, కోశాధికారి అన్నపూర్ణ, పి.బాలస్వామి, రూప్‌సింగ్, సురేష్, బాలోజి, వాసం వరలక్ష్మి, కిషోర్‌సింగ్, మాన్సింగ్, హరికుమార్, వీరన్న, రవి, గురుప్రసాద్, లక్ష్మణ్, మంజిలాల్, సునీత, కృష్ణకుమారి, ముత్తు బాయమ్మ, దీప, వెంకటరెడ్డి, లక్ష్మయ్య, మురళీ, బాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment