భద్రగిరిలో వైభవంగా తెప్పోత్సవం
● ఊరేగింపుగా గోదావరి తీరానికి రామయ్య ● వేదమంత్రోచ్ఛరణలతో హంస వాహనంలో వేంచేపు ● సాయంత్రం 6–01 గంటలకు మొదలైన వేడుక ● గంటపాటు కొనసాగిన జలవిహారం ● గోదావరి తీరానికి పోటెత్తిన భక్తులు
వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్త జనుల జయజయ ధ్వానాల నడుమ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామి గోదావరిలో జలవిహారం చేశారు. రాములోరి నదీ విహారంతో గోదావరి తల్లి పులకించగా ఈ దృశ్యాలను చూస్తూ భక్తులు రామనామ స్మరణ చేశారు. దీంతో భద్రగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం కనుల పండువగా సాగింది.
– భద్రాచలం
Comments
Please login to add a commentAdd a comment