పాండిచ్చేరికి ఉపాధ్యాయుడి టీఎల్‌ఎం
మణుగూరు టౌన్: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు పరమయ్య తయారు చేసి న టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ త్వరలో పాండిచ్చేరిలో జరగబోయే సౌత్ ఇండియా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ంది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బాలవైజ్ఞానిక్ ప్రదర్శనలో గురువారం టీఎల్‌ఎం ప్రదర్శించారు. 33 జిల్లాల నుంచి 48 ఎగ్జిబిట్లు రాగా పరమయ్య తయారు చేసిన టీఎల్‌ఎం మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా అతిథుల నుంచి అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు.
రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్‌లో ప్రతిభ
మణుగూరు రూరల్ : రాష్ట్రస్థాయి బాల వైెజ్ఞానిక ప్రదర్శనలో మణుగూరు ఎక్స్‌లెంట్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనా జాతీయ స్థాయికి ఎంపికై ంది. యాజమాన్యం రాష్ట్రస్థాయి ఇన్‌స్పైర్ అవార్డ్ అందుకుంది. విద్యాసంస్థల చైర్మన్ ఎండీ యూసఫ్ షరీఫ్, కరస్పాండెంట్ ఖాదర్, డైరెక్టర్ యాకుబ్ షరీఫ్, వెంకట్‌లు హర్షం వ్యక్తం చేశారు. నమూనా తయారు చేసిన విద్యార్థులను అభినందించారు.
సౌత్ ఇండియా పోటీలకు ఎంపిక
ములకలపల్లి : మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన ఇసుకుర్తి ప్రణీత్ సౌత్ ఇండియా లెవల్ విద్యా వైజ్ఞానిక పోటీలకు ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయిలో పోటీల్లో ప్రథమ స్థానం కై వసం చేసుకున్న ప్రణీత్ సౌత్ ఇండియా లెవల్ పోటీల్లో స్థానం దక్కించుకున్నాడు. జడ్చర్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలకు రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి 517 స్టాళ్లు ఏర్పాటు చేయగా.. నేచురల్ ఫామింగ్ (సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం) విభాగంలో ప్రణీత్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రణీత్, గైడ్ టీచర్ మందారి సారలమ్మ మెమెంటో, ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రణీత్‌ను హెచ్‌ఎం వెంకటనర్సమ్మ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment